మావోయిస్టుల సంచారం నేపథ్యంలో డీజీపీ ఏరియల్ సర్వే

మావోయిస్టుల సంచారం నేపథ్యంలో డీజీపీ ఏరియల్ సర్వే
x
Highlights

Aerial survey : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రంభీం జిల్లా...

Aerial survey : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో పర్యటిస్తున్నారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు.

ఆయన వెంట జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రామగుండం సీపీ సత్యానారయణ అన్నారు. హెలిప్యాడ్ వద్దే అధికారులతో మావోయిస్టు కదలికలపై సమీక్షించారు. అక్కడి నుంచి ఉట్నూరు బయల్దేరి వెళ్లారు డీజీపీ. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. ఐతే మహేందర్ రెడ్డి పర్యటనను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories