TS TRANSCO: త్వరలోనే ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేస్తాం: ట్రాన్స్‌కో సీఎండీ

Devulapalli Prabhakar Rao says that the Covid Vaccine Would be Given to TS TRANSCO Employees Soon
x

టీఎస్ ట్రాన్స్ కో 

Highlights

TS TRANSCO: విద్యుత్తు ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్‌ ను త్వరలోనే వేస్తామని దేవులపల్లి ప్రభాకర్‌రావు సోమవారం అన్నారు

TS TRANSCO: విద్యుత్తు ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్‌ ను త్వరలోనే వేస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సోమవారం అన్నారు. ఈ మేరకు విద్యుత్‌సౌధలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ టీకా ఇచ్చేందుకు త్వరలోనే ఓ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నిరంతర విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్‌సౌధలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అలాగే జోనల్‌, సర్కి ల్‌ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను కోరారు. కాగా, ఉద్యోగుల కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే సిబ్బంది విధులకు హాజరు కావొద్దని సూచించారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories