Kaleshwaram Temple: తెలంగాణాలోని మహా శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వర పుణ్యక్షేత్రం

Devotees coming from the states of Telangana, Maharashtra and Chhattisgarh To Kaleshwaram Temple
x

Kaleshwaram Temple: తెలంగాణాలోని మహా శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వర పుణ్యక్షేత్రం 

Highlights

Kaleshwaram Temple: శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి

Kaleshwaram Temple: తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఉంది. అతిప్రాచీన చరిత్ర గల కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. గర్భగుడికి నాలుగుదిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు ఉండటం కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత.

కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వరంలో తొలి దేవాలయమిదే అని అర్చకులు చెబుతారు. కాళేశ్వరుడు ఏర్పడకముందు.. ముక్తేశ్వరుడుగా పరమేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతంగా ఇది విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో పంచాయతన విధానంలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ముక్తేశ్వరుడికి కూడా రెండు నాసికారంధ్రాలు ఉండడం విశేషం. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎక్కడ త్రవ్వినా ఎర్రని రంగు గల మట్టిరాళ్లు దొరుకుతాయి. ఈ రాళ్ళను పగులగొడితే దానిలో పరిమళ భరితమైన మెత్తని భస్మము ఉంటుంది. అందుకే ప్రకృతిసిద్ధ విభూతి రాళ్ల క్షేత్రంగా ఈ ఆలయానికి పేరుంది.

భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటుగా వైదిక కార్యాలు నిర్వహిస్తుంటారు. కాళేశ్వర క్షేత్రం పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు విశిష్టమైన క్షేత్రం. కాశికి వెల్లలేని వాళ్ళు కాళేశ్వరంలోని గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక్కడ చేసే ఈ కార్యక్రమాలు కాశిలో జరిపించినంత పుణ్యాన్ని ప్రాప్తింప చేస్తాయని చెప్తారు. పితరులకు తర్పణాలు వదలడం, శ్రార్ధ కర్మ నిర్వర్తించడం ఇక్కడికి వచ్చే భక్తులు తప్పక ఆచరిస్తుంటారు. అందుకే ఇక్కడి అంగళ్లలో వీటికి అవసరమైన నువ్వులు, ఇతర దినుసులు విరివిగా లభ్యమవుతుంటాయి.ఇక శ్రీ కాళహస్తి తరువాత కాలసర్ప, శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, నవగ్రహాలయంలో శనిదోష నివారణకు శనిపూజలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్చకులు చెబుతున్నారు. త్రివేణీసంగమ క్షేత్రంలో వైదికకార్యక్రమాలు నిర్వహించడం మోక్షదాయకమని వారు పేర్కొన్నారు.

కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్ల ఆలయానికి సరస్వతీ దేవాలయం, సూర్య దేవాలయం, ఆది ముక్తీశ్వరాలయాలతో కూడిన పరివార ఆలయ సముదాయం ఉంది. దేశంలో సూర్యదేవాలయాలలో ఒకటి కాళేశ్వరం, మరొకటి కోణార్క్, ఇంకొకటి అరసవల్లిలో ఉన్నాయి. సరస్వతి అమ్మవారికి దేశంలో మూడు ఆలయాలున్నాయి. ఒకటి కాళేశ్వరంలో మహా సరస్వతి, రెండోది బాసరలో జ్ఞాన సరస్వతి, మూడోది కాశ్మీరులో బాలసరస్వతి ఆలయం ఉంది. కాగా శ్రీ శంకర భగవత్పాదులు ఆదిశంకారాచార్యులు, తదుపరి శారదాపీఠాధిపతులు తమ శిష్య గణాలతో ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారతదేశంలోని కాళేశ్వరంకు వచ్చి శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్లకు దక్షిణాన మహా సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం కాళేశ్వరాన్ని వేములవాడ తరహాలో అభివృద్ధిపరచటానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో గృహసముదాయం, అతిథిగృహాలు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద గోదావరిపై అంతర్ రాష్ట్ర హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించగా అటు మహారాష్ట్ర ప్రజలు, ఇటు తెలంగాణ, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజల రాకపోకలతో కాళేశ్వరం పూర్వ వైభవాన్ని సంతరించుకుం

Show Full Article
Print Article
Next Story
More Stories