Peddamma Temple: భక్తులతో కిటకిటలాడిన పెద్దమ్మతల్లి ఆలయం.. ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అర్చకులు

Peddamma Temple: అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు

Shekhar G
Published on: 25 Aug 2023 12:58 PM IST
Devotees At Peddamma Temple Jubilee Hills
X

Peddamma Temple: భక్తులతో కిటకిటలాడిన పెద్దమ్మతల్లి ఆలయం.. ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అర్చకులు

Peddamma Temple: శ్రావణమాసం రెండో శుక్రవారం కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్దమ్మ తల్లి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అటు అమ్మవారికి 31 రకాల విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రావణమాసం రెండవ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో మహాలక్ష్మిని పూజించడం వల్ల పసుపు కుంకాలతో, సౌభాగ్యంతో ఉంటారని భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు.

Shekhar G

Shekhar G

Next Story