Devireddy Sudheer Reddy: వ్యక్తిగత ఆరోపణలు తప్ప కాంగ్రెస్, బీజేపీలు చేసేదేమీ లేదు

Devireddy Sudheer Reddy: నియోజకవర్గ సమస్యలపై కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులకు అవగాహన లేదు

Shekhar G
Published on: 7 Nov 2023 4:40 PM IST
Devireddy Sudheer Reddy Comments On BJP And Congress
X

Devireddy Sudheer Reddy: వ్యక్తిగత ఆరోపణలు తప్ప కాంగ్రెస్, బీజేపీలు చేసేదేమీ లేదు

Devireddy Sudheer Reddy: వ్యక్తిగత ఆరోపణలు తప్ప కాంగ్రెస్, బీజేపీలు చేసేదేమీ లేదని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. హస్తినాపురం డివిజన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్యర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనానికి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ,కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు అవగాహన లేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ రేవంత్ రెడ్డికి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన ఒక్క కార్యకర్త ఫోన్ లిఫ్ట్ చేసినా.. మాట్లాడినా వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఎల్బీనగర్ సమస్యలపై అవగాహన లేని నాయకులు పోటీ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story