Devarakadra Municipal Election Results 2026: దేవరకద్రలో ‘హంగ్’ ఉత్కంఠ: మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో కాంగ్రెస్.. పీఠం దక్కేది ఎవరికి?

Devarakadra Municipal Election Results 2026: మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 11:20 AM IST
Devarakadra Municipal Election Results 2026: దేవరకద్రలో ‘హంగ్’ ఉత్కంఠ: మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో కాంగ్రెస్.. పీఠం దక్కేది ఎవరికి?
X

Devarakadra Municipal Election Results 2026: మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి కూడా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) దక్కలేదు. దీంతో కింగ్ మేకర్లుగా మారిన స్వతంత్రులు మరియు బీజేపీ అభ్యర్థి మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది.

బలాబలాలు ఇలా ఉన్నాయి:

మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఫలితాల సరళి ఇలా ఉంది:

కాంగ్రెస్: 06 వార్డులు

బీఆర్ఎస్: 04 వార్డులు

బీజేపీ: 01 వార్డు

ఇతరులు (ఇండిపెండెంట్): 01 వార్డు

మొత్తం 12 స్థానాల్లో మున్సిపల్ పీఠాన్ని అధిరోహించడానికి 7 స్థానాలు అవసరం కాగా, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్ నిలవగా.. బీఆర్ఎస్ 4 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్థి లేదా స్వతంత్ర అభ్యర్థి ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపైనే దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఆధారపడి ఉంది. రాజకీయ చదరంగంలో పైచేయి సాధించేందుకు ఇరు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story