Lock Down: లాక్ డౌన్ పై స్పందించిన డిప్యూటీ సీఎం మొహమ్మద్ ఆలీ

Deputy CM Mahmood Ali responding to the lockdown
x

 లొక్డౌన్:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Lock Down: లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూల వార్త పై స్పందించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

Lock Down: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్లు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోపైపు తెలంగాణలో సైతం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలను విధించే అవకాశమే లేదని చెప్పారు.

లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అనేక మంది జీవితాలు, వ్యాపారాలు ప్రభావితమవుతాయని చెప్పారు. కేసులు పెరగకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాఠశాలలు, మదర్సాలు పని చేయాలా? వద్దా? అనే విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న మహారాష్ట్రలోని కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు. పంజాబ్ లో నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలలోనూ కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా జరగనున్న హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే ఢిల్లీలో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఢిల్లీలో ఈ నెల 28, 29, 30 తేదీలలో లాక్ డౌన్ విధిస్తే హోలీ కారణంగా వ్యాప్తి చెందుతుంది అని భావిస్తున్న కరోనా నియంత్రించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. మరో వైపు హోళీ వేడుకలను నిషేధించే పనుల్లో ఆయా ప్రభుత్వాలు కసరత్తును ముమ్మరం చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories