జ్వరామాబాద్‌గా మారిన నిజామాబాద్, దాడి చేస్తున్న డెంగ్యూ, చికెన్ గున్యా

జ్వరామాబాద్‌గా మారిన నిజామాబాద్
Nizamabad: * ఇంటింటి సర్వే చేపట్టిన అధికారగణం * ఇప్పటికే 39 డెంగ్యూ కేసుల నమోదు * 100 పైగా బాధితులు ఉండవచ్చని అంచనా
Nizamabad: సీజనల్ వ్యాధులు.. ఆ జిల్లాను వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.. చికెన్ గున్యా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనాకు వైరల్ ఫీవర్స్ తోడవ్వడంతో.. ఇందూరు జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతుంటే.. వైరల్ ఫీవర్స్ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. జ్వరాలతో జిల్లా ములుగుతుంది. ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్‌తో పాటు బాన్సువాడలో డెంగ్యూ కేసులు వెలుగు చూడగా.. సారంగాపూర్‌లో చికెన్ గున్యా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
జిల్లాలో వర్షాలు మొదలైనప్పటీ నుంచి ప్రజలు సాధారణ జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్‌తో మంచం పడుతున్నారు. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 39 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 12 చికెన్ గున్యా కేసులను గుర్తించారు. ఇక ఫీవర్ సర్వేలో 15 వేల మంది జ్వరాలతో బాధ పడుతున్నట్లు తేల్చారు. ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం మరింత పెరిగేలా ఉంది
ఇక జిల్లా కేంద్రంలోని సారంగాపూర్‌లో హైదరాబాద్ ప్రత్యేక టీం పర్యటించింది. సర్వేలో డెంగ్యూ కారక దోమలను గుర్తించి, వాటి లార్వా సేకరించారు. అంతేకాక జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఎఫిడమాలజీ విభాగం వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే కేసులు ఎక్కువైనట్లు వారు అంచనా వేశారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.నిన్నటి వరకు కరోనా రోగులను పీల్చి పిప్పి చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు వైరల్ ఫీవర్స్‌తో వచ్చే బాధితులను దోచుకుంటున్నారు. డెంగ్యూ పేరుతో రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMTనేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
29 May 2022 6:09 AM GMTదేశంలో ముంచుకొస్తున్న బొగ్గు సంక్షోభం.. 4.25 కోట్ల టన్నుల బొగ్గు...
29 May 2022 5:55 AM GMTAlert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్.. మే 31లోపు ఈ పని చేయకపోతే 4 లక్షల...
29 May 2022 5:30 AM GMT