Coronavirus: ఆక్సీమీటర్లకు పెరుగుతున్న డిమాండ్

Demand for pulse oximeters
x

Coronavirus: ఆక్సీమీటర్లకు పెరుగుతున్న డిమాండ్

Highlights

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండగా మార్కెట్‌లో నయా దందాపుట్టుకొచ్చింది.

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండగా మార్కెట్‌లో నయా దందాపుట్టుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్‌లో రెమ్‌డిసీవర్‌, ఆక్సిజన్‌ సిలిండర్లును ఎక్కవ ధరకు అమ్ముతుండగా ఇప్పుడు అదే బాటలో ఆక్సీమీటర్‌ను కూడా సేల్‌ చేస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా లోకల్‌ మేడ్‌ ఆక్సీమీటర్లను బ్రాండెడ్‌ పేరు మీద అమ్మకాలు జరిపేస్తున్నారు. నగరంలోని కొన్ని మెడికల్స్‌ హాల్స్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందాకు అలవాటు పడ్డారు.

కరోనా వేళ ఇప్పుడు చాలా వినిపిస్తోన్న పేరు పల్స్‌ ఆక్సీమీటర్‌. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నవాళ్లు దీన్ని ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే శరీరంలో ఆక్సీజన్‌ లెవల్స్‌ ఎంత ఉన్నాయనేది పల్స్‌ ఆక్సీమీటర్‌ గుర్తిస్తుంది. దీంతో కరోనా బాధితులు కూడా ఆక్సీమీటర్‌ను వినియోగిస్తున్నారు. ఇక హాస్పిటల్‌కు వెళ్లే ముందు ఇంట్లోనే ఆక్సీజన్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకుని కోవిడ్‌ చికిత్సకు వెళ్తుతున్నారు. ఇక చాలామంది ఆక్సీమీటర్‌ కొనుగోలు చేసేందుకు మెడికల్‌ హాల్స్‌ బాట పడుతున్నారు. దీంతో మెడికల్‌ షాపు నిర్వాహకులు ఆక్సీమీటర్‌ను సాధరణ ధరకంటే రెండు నుండి మూడు రేట్లు పెంచి అమ్ముతున్నారు.

ఇక శరీరంలో 95శాతం కంటే ఎక్కువ ఆక్సీజన్‌ లెవల్స్‌ ఉంటే పర్లేదే కానీ తగ్గితే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడం మంచిదంటున్నారు వైద్యులు. ఆక్సీమీటర్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో మార్కెట్‌లో కూడా వాటి కొరత ఏర్పడిందంటున్నారు డాక్టర్లు‌. మొత్తానికి ప్రజల అవసరాని క్యాష్‌ చేసుకుంటూ కొన్ని మెడికల్‌ హాల్స్‌ నిర్వాహకులు బ్లాక్‌ దందాకు తెరలేపారు. ఆక్సీమీటర్‌ కొందామని వెలితే దానిపై ఉన్న ధర కంటే మూడు రెట్లు ఎక్కువ అమ్మడమేంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories