logo
తెలంగాణ

ఢిల్లీలో రెండోరోజు కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన

ఢిల్లీలో రెండోరోజు కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన
X
Highlights

సీఎం కేసీఆర్‌ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంకోసం సంబంధిత శాఖల మంత్రులను...

సీఎం కేసీఆర్‌ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంకోసం సంబంధిత శాఖల మంత్రులను సీఎం కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు కేంద్రమంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై కేంద్ర మంత్రి హర్దిప్‌ సింగ్‌ పూరితో సీఎం చర్చించారు. పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మామూనూర్, నిజామాబాద్ జిల్లాలో జక్రాన్‌ పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర విమానాశ్రయాల ఏర్పాటు, అవశ్యకతపై కేంద్ర మంత్రికి కేసీఆర్ లేఖ అందజేశారు. దాంతో పాటు తెలంగాణలో నిర్మిస్తున్న డబూల్ బెడ్రూంలకు రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది.


Web TitleDelhi: Telangana CM K Chandrasekhar Rao meets Union Minister Hardeep Singh Puri
Next Story