ఎన్నో యుద్ధాల్లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఎన్నో యుద్ధాల్లో ఎయిర్ ఫోర్స్  కీలక పాత్ర  పోషించింది : రాజ్‌నాథ్‌ సింగ్‌
x
Highlights

యుద్ధ విమాన విన్యాసాలతో మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్​ఫోర్స్ అకాడమీ కదనరంగాన్ని తలపించింది. అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా...

యుద్ధ విమాన విన్యాసాలతో మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్​ఫోర్స్ అకాడమీ కదనరంగాన్ని తలపించింది. అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్‌కు వాయుసేన ఘనస్వాగతం పలికింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాజ్‌నాథ్‌ సింగ్‌ అవార్డులు ప్రదానం చేశారు.

ఎన్నో యుద్దాలలో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, టెక్నాలజీ సాయంతో భారత వాయుసేన మరింత శక్తిమంతం అయ్యిందన్నారు. బాలాకోట్ దాడులతో భారత ఎయిర్ ఫోర్స్ సత్తా ప్రపంచానికి తెలిసిందని వెల్లడించారు. రఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్ పోర్స్‌‌కి మరింత బలం ఇచ్చిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories