సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ నిర్ణయం

Decision Today on Custody of Accused in Saroornagar Murder Case
x

సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ నిర్ణయం

Highlights

*నిందితులు ఇద్దరా? ఐదుగురా? అన్న కోణంలో దర్యాప్తు

Saroornagar: సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ కోర్టు నిర్ణయం వెలువరించనుంది. వారం రోజుల కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిసాయి. నిందితులను కస్టడీకి తీసుకుంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నిందితులు ఉపయోగించిన లోకేషన్ ట్రేస్ టెక్నాలజీపై పోలీసులు ఫోకస్ చేశారు. నిందితులు ఇద్దరా? ఐదుగురా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోదరి అశ్రిన్ తమకు నచ్చని ప్రేమపెళ్లి చేసుకుందని ఈనెల 4న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో మోబిన్ అహ్మద్ తన బావతో కలిసి నాగరాజును దారుణంగా హతమార్చాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories