తరతరాలుగా మారని గిరిజనుల తలరాత

తరతరాలుగా మారని  గిరిజనుల తలరాత
x
Highlights

కాకులు దూరని కారడవిలో గిరిజనుల కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని వారి జీవితాలు దుర్భరస్థితిలో గడుస్తున్నాయి. అక్షరాలు...

కాకులు దూరని కారడవిలో గిరిజనుల కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని వారి జీవితాలు దుర్భరస్థితిలో గడుస్తున్నాయి. అక్షరాలు నేర్పే బడిలేదు ఏదైనా రోగం వచ్చినా లేక డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య బతుకీడుస్తున్నారు. సూర్య చంద్రుల వెలుగులతో బతుకుతున్న చీకటిబతుకులపై హెచ్‌ఎంటీవీస్పెషల్‌ స్టోరీ

తరతరాలుగా మారని గిరిజనుల తలరాత. హైటెక్‌ యుగంలో దారి లేని గ్రామం. గొంతెండుతున్న గిరిజన తండా. పాలకులు మారినా మారని బతుకులు. కరెంట్‌ వెలుగులకు నోచుకోని బతుకులు. ఇది.. ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజవాసుల దుర్బరపరిస్థితి. వంద మంది నివసించే గూడెం జనానికి ఈ ఊటనీరే దిక్కు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేతిపంపు నోరెళ్లబెట్టింది. ఎండాకాలం మొదల్నుంచీ కనీస నీటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు.ఇంతటి దుర్భర స్థితిలో కాలం గడుపుతున్నారు మంగ్లీ గ్రామ గిరిజన వాసులు.

జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్లదూరంలో ఉన్న గ్రామంలో 150 మంది జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. దట్టమైన అడవి ప్రాంతంలో కొండ కొనలు, రాళ్లు రప్పల మధ్యే ప్రయాణం సాగిస్తారు. కనీసం అంబులెన్స్‌ వచ్చే దారి లేకపోవడంతో ఎడ్లబడిపైనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక గర్బిణీల పరిస్థితి దారుణంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నవీరికి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆవేదన చెందుతున్నారు. పిల్లలకు చదువుకునేందుకు బడిలేదని చదువుకోవాలంటే అడవి మార్గంలో 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివస్తోందంటున్నారు. దీంతో ఆ చిన్నారులు బడికి దూరమయ్యారని చెబుతున్నారు. సర్కారు బడి అందుబాటులో లేకపోవడంతో చదువుకోవాల్సిన పిల్లలు పనిపిల్లలుగా మారుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు గ్రామానికి కరెంట్‌ సౌకర్యంకూడా లేకపోవడంతో చీకట్లోలోనే జీవనం సాగిస్తున్నామంటున్నారు స్ధానికులు. రాత్రిపూట అడవీజంతువులు, పాములు గూడెంలోకి వస్తున్నాయని వాపోతున్నారు. సమస్యలతో తమ గ్రామం సతమతమవుతున్నా అధికారులు కన్నేత్తి చూడటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ధీనంగా గిరిజనవాసులు వేడుకుంటున్నారు




Show Full Article
Print Article
More On
Next Story
More Stories