Davos WEF Summit 2026: దావోస్ WEF సమ్మిట్ 2026కు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు

Davos WEF Summit 2026: దావోస్ WEF సమ్మిట్ 2026కు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు
x

Davos WEF Summit 2026: దావోస్ WEF సమ్మిట్ 2026కు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు

Highlights

దావోస్‌లో జరిగే WEF సమ్మిట్ 2026కు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పెట్టుబడులే ప్రధాన లక్ష్యం.

Davos WEF Summit 2026: దావోస్ WEF సమ్మిట్ 2026కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. నేటి నుంచి (జనవరి 19) ఈ నెల 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum – WEF) వార్షిక సదస్సు జరగనుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 65 మంది దేశాధినేతలు, 130 దేశాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రముఖులు, 850 మంది అగ్రశ్రేణి సీఈవోలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.

పోటీ ప్రపంచంలో సహకారం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై ఈసారి ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. భారత్‌ నుంచి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే దావోస్‌కు బయల్దేరారు. మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌తో పాటు ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించే చంద్రబాబు నాయుడు మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చలు, ప్లీనరీ సెషన్లలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు. యూఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో సమావేశాలు కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు దావోస్‌కు బయల్దేరనుంది. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. దావోస్‌లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో పాటు ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు జరపనున్నారు. అలాగే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ, ఏఐ హబ్‌లను ఆవిష్కరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories