తెలంగాణ ఉద్యమంతో తలసానికి ఏమైనా సంబంధం ఉందా?: శ్రవణ్

Arun Chilukuri
Updated on: 27 Feb 2021 7:45 PM IST
తెలంగాణ ఉద్యమంతో తలసానికి ఏమైనా సంబంధం ఉందా?: శ్రవణ్
X

తెలంగాణ ఉద్యమంతో తలసానికి ఏమైనా సంబంధం ఉందా?: శ్రవణ్

మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తారక రామారావు కాదని.. తోకముడిచిన రామారావు అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. తలసాని ఓ ఆకురౌడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' పదో తరగతి ఫెయిల్ అయ్యి గల్లీల్లో తిరిగే ఆకు రౌడీ తలసాని. కేటీఆర్‌! నీకు చర్చకు వచ్చే దమ్ము లేదు కానీ, నీ ఆలుగడ్డల శ్రీనివాస్‌తో నన్ను తిట్టిస్తావా..? ఉద్యోగాలు అడిగితే మేము గొట్టం గాళ్లం అయ్యామా..?. ఈ గొట్టం గాని కోసమే కేటీఆర్ నా ఇంటికి మూడు సార్లు వచ్చాడు.. టీఆర్‌ఎస్‌లో చేరు అని. తలసాని ఓ సన్నాసి అంటూ ఫైర్ అయ్యారు.

పదో తరగతి ఫెయిల్ అయినోడివి.. నీకు నిరుద్యోగుల బాధ ఎట్లా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నువ్వు...టీఆర్‌ఎస్‌కి చెంచావి. పైసలిచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన నువ్వా.. నన్ను గొట్టం గాడు అనేది..? నీ లెక్క పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమకారుల పార్టీలో తలసాని లాంటి లఫంగిలు చేరారు. నేను గొట్టంగాన్నో.. కాదో కేసీఆర్‌ని అడుగు అంటూ మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story