Hyderabad: హైదరాబాద్‌లో 90 శాతం కల్తీ కల్లే.. ఒకవేళ అది తాగారో.. ఇక అంతే..

Hyderabad: హైదరాబాద్‌లో 90 శాతం కల్తీ కల్లే.. ఒకవేళ అది తాగారో.. ఇక అంతే..
x
Highlights

Hyderabad: హైదరాబాద్‌ నగరం కల్తీకి అడ్డాగా మారిపోతుంది. ఆహారపదార్ధాలు కల్తీ, పానీయాలు కల్తీ. మందు కల్తీ. కల్లు కల్తీ. కొంతమంది వ్యాపారస్తులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని బలిస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ నగరం కల్తీకి అడ్డాగా మారిపోతుంది. ఆహారపదార్ధాలు కల్తీ, పానీయాలు కల్తీ. మందు కల్తీ. కల్లు కల్తీ. కొంతమంది వ్యాపారస్తులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని బలిస్తున్నారు. ఇటీవల కూకట్ పల్లిలో జరిగిన ఘటనతో హైదరాబాద్ నగరం వాసులు ఉలిక్కిపడ్డారు. కల్తీ కల్లు తాగి 5గురు చనిపోగా, ఇంకా 31 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇదిలా ఉంటే, నగరంలో దొరికే కల్లులో 90 శాతం కల్లు కల్తీయేనని తాజాగా తేలింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో కల్తీ కల్లు తాగి ఎంతోమంది చనిపోతున్నారు. తాజాగా కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి ఐదుగురు చనిపోగా.. 30 మంది నిమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కల్తీకల్లుపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడక్కడ కల్తీ కల్లుని అమ్ముతున్నారో తెలుసుకుని.. అక్కడ శోధాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

కల్లు అనేది స్వచ్చమైన నేచురల్ వాటర్. దీన్ని తాటిచెట్టు, ఈత చెట్టు నుంచి తీస్తారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో డబ్బులు కోసం కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. స్వచ్చంగా వచ్చిన కల్లులో కొన్నిరసాయనాలు కలుపుతున్నారు. మరికొందరైతే పౌడర్, కెమికల్స్ కలిపి డూప్లికేట్ కల్లునే తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియక తాగారో.. ఇది ప్రాణాలకే ప్రమాదం.

ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ నగరంలో కల్లుకి డిమాండ్ ఎక్కువైంది. ఎందుకంటే ఎక్కడ నుంచే కార్మికులు హైదరాబాద్ నగరానికి కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని వాళ్లు తగ్గించుకోడానికి కల్లు ఎక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా పేద , మధ్యతరగతి శ్రామికులే కల్లుని ఎక్కువగా తాగుతుంటారు. అయితే నగరంలో సహజసిద్దమైన కల్లు కంటే ప్రమాదకరమైన కల్లు ఎక్కువగా దొరుకుతుంది.

కృతృమ కల్లులో క్లోరల్, హైడ్రేట్, డైజోపామ్, అల్ర్పాజోలమ్ వంటివి కలుపుతున్నారు. ఇది మత్తుని ఇస్తుంది. శ్రమను మరిచిపోయేలా చేస్తుంది. అందుకే శ్రామికులు ఎగబడి మరీ ఈ కల్లును తాగుతున్నారు. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. హైదరాబాద్ నగరంలో దాదాపు 90 శాతం కల్లు కల్తీ కల్లే ఉందని అధికారులు నిర్ధారించారు. దీంతో ఇప్పుడు ఈ విషయం అందరినీ కంగారుపెడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories