CM KCR: దళిత బంధు పథకం కాదు.. ఒక ఉద్యమం

CM KCR: తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని ఉద్యమమని సీఎం కేసీఆర్ అన్నారు.

Arun Chilukuri
Published on: 26 July 2021 6:08 PM IST
Dalit Bandhu is an Agitation Says CM KCR
X

CM KCR: దళిత బంధు పథకం కాదు.. ఒక ఉద్యమం

CM KCR: తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని ఉద్యమమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్ లో తెలంగాణ దళితబందు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందన్నారు.

వారం పది రోజుల్లో హుజురాబాద్ లో స్పెషల్ డ్రైవే చేపట్టి అసైన్డ్ సహా దళితుల అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇళ్లు లేని దళితులందరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. ఖాళీ స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుందని చెప్పారు. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని చెప్పారు. పథకంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సూచించాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story