Police Websites Hacked: సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్లు హ్యాక్‌

Police Websites Hacked: సైబర్‌ గాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 4 Dec 2025 11:25 AM IST
Police Websites Hacked: సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్లు హ్యాక్‌
X

Police Websites Hacked: సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్లు హ్యాక్‌

Police Websites Hacked: సైబర్‌ గాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు. దీంతో.. వారం రోజులుగా రెండు కమిషనరేట్ల పోలీస్‌ వెబ్‌సైట్లు పనిచేయడం లేదు. పోలీస్‌ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్‌ అధికారుల కాంటాక్ట్‌ నెంబర్లను హ్యాక్‌ చేశారు సైబర్‌గాళ్లు. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన రెండు కమిషనరేట్ల ఐటీ టీమ్స్‌.. వెబ్‌సైట్లలో మాల్వేర్‌ చొరబడినట్లు అనుమానిస్తున్నాయి.

నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ పర్యవేక్షణలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు.. సైట్ల పునరుద్ధరణ బాధ్యత తమ భుజాన వేసుకున్నారు. మరోసారి హ్యాకింగ్‌కు గురికాకుండా అధునాతన ఫైర్వాల్స్‌ ఆడిట్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లను అప్డేట్‌ చేయిస్తున్నాయి ఐటీ టీమ్స్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story