కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో కీలక పరిణామం.. సీనియర్ నేత మల్లు రవికి నోటీసులు..

Congress War Room Case: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 9 Jan 2023 4:36 PM IST
Cyberabad Crime Police Send Notices to Mallu Ravi
X

కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో కీలక పరిణామం.. సీనియర్ నేత మల్లు రవికి నోటీసులు..

Congress War Room Case: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్‌క్రైమ్ నోటీసులు ఇచ్చారు. మల్లు రవికి 41సీఆర్పీసీ కింద సైబర్‌ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని నోటీసులు పేర్కొన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో భాగంగా సోమవారం సునీల్‌ కనుగోలును విచారించారు పోలీసులు. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కాగా ఈ కేసుపై స్పందించిన మల్లు రవి టి.కాంగ్రెస్‌ వార్‌రూమ్‌కి తానే ఇంచార్జ్‌ అని చెప్పుకున్నారు. నోటీసులు ఇస్తే తనకు ఇవ్వాలని కానీ, సునీల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు? ఇందులో భాగంగానే 41 సీఆర్పీసీ కింద విచారణకు హాజరుకావాలని మల్లు రవికి నోటీసులు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story