TSPSC Paper Leak: ఇవాళ్టితో ముగియనున్న TSPSC నిందితుల కస్టడీ

* నిందితుడు రాజశేఖర్‌ TSPSC నుంచి పేపర్ తెచ్చి రమేష్‌కు ఇచ్చినట్టు గుర్తింపు

Dhatripriya
Published on: 23 March 2023 10:34 AM IST
Custody Of TSPSC Accused Will End Today
X

TSPSC Paper Leak: ఇవాళ్టితో ముగియనున్న TSPSC నిందితుల కస్టడీ

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీక్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కమీషన్‌లో పనిచేస్తున్న 42మంది ఉద్యోగులకు సిట్ నోటీసులు అందించింది. ఇవాల్టీతో TSPSC నిందితుల కస్టడీ ముగియనుంది. ఔట్ సోర్స్ ఉద్యోగులకు కాన్ఫిడెన్సియల్ రూమ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించినట్టు సిట్ గుర్తించింది. నిందితుడు రాజశేఖర్‌కు TSPSC నుంచి పేపర్ తీసుకొచ్చి రమేష్‌కు ఇచ్చాడు. దీంతో రాజశేఖర్ మిత్రులు, సురేశ్, రమేష్‌లను సిట్ విచారిస్తోంది. మరోసారి కాన్ఫిడెన్సియల్ రూమ్ ఇంఛార్జ్ శంకర్ లక్ష్మిని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలు ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story