నేటితో ముగియనున్న HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ

Siva Balakrishna: 8వ రోజు ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ

Jyothi
Published on: 7 Feb 2024 9:46 AM IST
Custody of former HMDA director Siva Balakrishna will end today
X

నేటితో ముగియనున్న HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ

Siva Balakrishna: HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ కస్టడీ నేటీతో ముగియనుంది. ఏడు రోజులుగా విచారించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు కోరనున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో అక్రమాస్తులతో పాటు బినామీలను గుర్తించారు. బినామీలందరిని విచారించేందుకు ఇంకాస్త సమయం పడుతోందని.... కావున శివబాలకృష్ణ మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు చేశారు. నవీన్ పేరుపై సైతం పలు ఆస్తులను గుర్తించారు.

HMDA మాజీ డెరైక్టర్ శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ సైతం బినామీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భరత్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. 120 ఎకరాల భూములు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు మరికొంత మంది బినామీలను గుర్తించారు. ఇప్పటికే పలువురు బినామీలు, HMDA ఉద్యోగులను సైతం ఏసీబీ అధికారులు విచారించారు. నేడు మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది. నాలుగు రోజులుగా HMDA ఆఫీసులోని 4, 7 అంతస్థుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని ఫైళ్లకు సంబంధించిన అనుమతులను ఏసీబీ బృందం తనిఖీ చేసింది. విచారణ ముగిసిన అనంతరం శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరచనున్నారు.

Jyothi

Jyothi

Next Story