MLC Kavitha: నేటితో ముగియనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ..

MLC Kavitha: మ. 2గంటలకు విచారించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 May 2024 8:44 AM IST
Custody of BRS MLC Kavitha will end today
X

MLC Kavitha: నేటితో ముగియనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ..

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ నేడు విచారణ జరగనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ, సీబీఐ హాజరు పరిచే అవకాశం ఉంది. ఆమెను వర్చువల్ గానా? భౌతికంగా హాజరు పరచాలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 26 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై ఈడీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది.

ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనున్నది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో జ్యుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకన్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story