ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో సమృద్ధిగా లభిస్తున్న సీతాఫల్

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో సమృద్ధిగా లభిస్తున్న సీతాఫల్
x
Highlights

సీతాఫలం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈసారి వర్షాలు విస్తారంగా పడటంతో సీతాఫలాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు...

సీతాఫలం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈసారి వర్షాలు విస్తారంగా పడటంతో సీతాఫలాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతున్న అమృత ఫలం సీతాఫలంపై హెచ్ఎంటీవి స్పెషల్ స్టోరీ.

మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా ఉన్న అడవుల్లో సీతాఫలాలు సమృద్దిగా లభిస్తాయి. ఇన్నాళ్లు సరైన వర్షాలు లేక ఏళ్లకేళ్లు సీతాఫలాలు కనిపించ లేదు. ఇప్పటి దాకా కనుమరుగైన సీతాఫలాలు గతేడాది, ఈసారి మంచి వర్షాలు పడటంతో మళ్లీ సమృద్ధిగా లభిస్తున్నాయి. ఒక్కో పండు అరకిలో వరకు బరువుండి, మంచిగా కండ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి నుంచి సితాఫల్ వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

సీతాఫల్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులోని ఎన్నో ఔషద గుణాలు అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం. ముఖ్యంగా రసాయనాలు లేకుండా కేవలం సహజమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ పండు లభిస్తుంది. హైపో థైరాయిడ్, చిగుళ్ల వాపు, కాళ్ల నొప్పులు, క్యాల్షియం లోపాన్ని నివారించటానికి సీతాఫల్ ఎంతో తోడ్పడుతుంది. లావు పెరగటానికి, గర్భిణీ స్త్రీలకు సీతాఫలం ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.

సీతాఫలాలు తినటానికే కాకుండా గుజ్జుతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు, ఐస్ క్రీం తయారీ, మిల్క్ షెక్ లకు, జూస్ లకు ఉపయోగిస్తారు. జిల్లాలో నవాబుపేట, దామరగిద్ద ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ తరపున ఏర్పాటు చేసారు. సీతాఫలానికి ఎన్నో పేర్లున్నాయి. షుగర్ యాపిల్, స్వీట్ సోప్, కస్టర్డ్ యాపిల్ లాంటి పేర్లతో పిలుస్తారు. శీతాకాలంలో దొరికే పండు కాబట్టి సీతాఫలం అనే పేరు ప్రధానంగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories