Tamilisai: ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరం

Tamilisai: ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి పై గవర్నర్ ట్వీట్

Shekhar G
Published on: 28 Jun 2023 2:39 PM IST
Current Condition Of Osmania Hospital Is Worrying Says Tamilisai
X

Tamilisai: ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరం

Tamilisai: దతాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ చూస్తే ఆందోళన కలుగుతోందంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో సర్కారు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో చేసిన ఓ పోస్టును గవర్నర్ రీ పోస్టు చేశారు.

జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పోస్టులో ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోతో పాటు, నూతన భవన నిర్మాణానికి సంబంధించి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫోటోలు ఇందులో ఉండటం గమనార్హం. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని గవర్నర్ ట్వీటర్ లో తెలిపారు. ఈ ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వానికి గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

Shekhar G

Shekhar G

Next Story