Nizamabad: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల తుక్కు..

Currency Notes in Nizamabad Bussapur Highway
x

Nizamabad: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల తుక్కు..

Highlights

Nizamabad: అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారి అవాక్కయ్యారు. వారికి కనిపించిన సీన్‌ చూసి కంగుతిన్నారు.

Nizamabad: అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారి అవాక్కయ్యారు. వారికి కనిపించిన సీన్‌ చూసి కంగుతిన్నారు. చూపు పక్కకు తిప్పకుండా ఆ కుప్ప దగ్గరకు వెళ్తున్నారు. కళ్లేదుట కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. ఇక పూర్తిగా దగ్గరకు వెళ్లాక అసలు విషయం బోదపడింది. అది కరెన్సీ నోట్ల తుక్కు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.

మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ నేషనల్ హైవేపై చిరిగిన కరెన్సీ తుక్కు కుప్పలుకుప్పలుగా పడి ఉంది. రోడ్డుపై ఉన్న సంచి పై నుంచి వాహనాలు వెళ్లడంతో సంచి నుంచి కరెన్సీ తుక్కు రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు కొట్టుకుపోయాయి. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకుని కరెన్సీ నోట్ల తుక్కును స్వాధీనం చేసుకున్నారు.

అయితే అవి అసలైనవా? నకిలీ నోట్లా?.. ఎక్కడికి తరలిస్తున్నారు?.. బుస్సాపూర్‌ వద్దకు ఎలా చేరుకున్నాయి. అసలు కరెన్సీ నోట్లను తుక్కుగా ఎందుకు మార్చారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అటుగా లోడ్‌తో వెళ్లిన వాహనాల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అది బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉందని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories