Ponnam Prabhakar: హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగు నీరు అందిస్తా

Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో తాగు నీటి సమస్య రాకుండా రూ.5 కోట్లు కేటాయించాం

Shashank Gullapelli
Published on: 13 March 2024 3:06 PM IST
Cultivation Water Is Provided To Agricultural Lands In Husnabad Constituency Says Ponnam Prabhakar
X

Ponnam Prabhakar: హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగు నీరు అందిస్తా

Ponnam Prabhakar: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగు నీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అన్వేటి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నెలరోజుల ముందే తాగు నీటి సమస్య ఏర్పడకుండా 5 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ తాగు నీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారాయన. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేస్తున్న ప్రభుత్వం తమదన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story