Wanaparthy: వనపర్లి జిల్లా ఫుల్గర్‌‌చర్లలో మొసలి కలకలం

* అర్ధరాత్రి 2గంటలకు గ్రామంలోకి ప్రవేశించిన మొసలి * పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు

Shilpa
Published on: 11 Nov 2021 11:22 AM IST
Crocodile Entering at Midnight in Fulgarcharla Village Wanaparthy District
X

వనపర్లి జిల్లా ఫుల్గర్‌‌చర్లలో మొసలి కలకలం(ఫైల్ ఫోటో)

Wanaparthy: వనపర్తి జిల్లా ఫుల్గర్ చర్ల గ్రామంలోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు గంటల సయయంలో ఊరి చివర ఉండే పొలాల నుంచి గ్రామంలోకి మొసలి ప్రవేశించింది. దీంతో గ్రామస్థులు భయాందోళను గురయ్యారు.

వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామున వచ్చి గ్రామస్తుల సహాయంతో మొసలిని బంధించారు. అనంతరం మొసలిని తీసుకెళ్లి బీచూపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు.

Shilpa

Shilpa

Next Story