సంగారెడ్డి జిల్లాలో విషాదం: పశువుల కాపరిపై మొసలి దాడి

X
సంగారెడ్డి జిల్లాలో విషాదం: పశువుల కాపరిపై మొసలి దాడి
Highlights
సంగారెడ్డి జిల్లా ఇసోజిపేటలో విషాదం చోటుచేసుకుంది. పశువుల కాపరిపై మొసలి దాడి చేసింది. సంగారెడ్డి జిల్లా...
Arun Chilukuri1 March 2021 6:18 AM GMT
సంగారెడ్డి జిల్లా ఇసోజిపేటలో విషాదం చోటుచేసుకుంది. పశువుల కాపరిపై మొసలి దాడి చేసింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న కొంత మంది రైతులు గట్టిగ అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తుండగానే మొసలి రాములును నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Web TitleCrocodile Attack on Cattle Herder in Sangareddy District
Next Story