Telangana News: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన ముసలం.. కమిటీ పదవులకు రాజీనామా చేసిన 13 మంది

Telangana News: పీసీసీ కమిటీల కూర్పుపై సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

Jyothi
Published on: 18 Dec 2022 6:18 PM IST
Crisis in The Telangana Congress
X

Telangana News: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన ముసలం.. కమిటీ పదవులకు రాజీనామా చేసిన 13 మంది

Telangana News: తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి గళం తార స్థాయికి చేరింది. పీసీసీ కమిటీల కూర్పుపై సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త కమిటీలు ప్రకంపనలు సృష్టించడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. తాజాగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 13 మంది పీసీసీ పదవులకు రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు పంపించారు. మేం నరేందర్‌ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ, వెంకటేష్‌, ఎర్రశేఖర్‌ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. సీనియర్‌ నేతల ఆరోపణలతో పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తమ వల్లనే వాళ్లకు పదవులు రావడం లేదని అనడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తమ పదవులు రాని వారికి ఇవ్వండంటూ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలపై సీనియర్‌ నేత జానారెడ్డి స్పందించారు. తానేది బహిరంగంగా మాట్లాడనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి చాలా జరిగాయని పేర్కొన్నారు. ఏది ఉన్నా అంతర్గతంగా చర్చిస్తానని తెలిపారు. కమిటీ విషయంలో గతంలోనూ ఎన్నో గొడవలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌లో ఇవేం కొత్త కాదన్నారు.

మరోవైపు తీవ్ర ఉత్కంఠ నడుమ ఇందిరాభవన్‌లో ప్రారంభమైన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావెద్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, బలరాం నాయక్, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరయ్యారు.

ఇందిరాభవన్‌లో జరుగుతున్న సమావేశానికి సీనియర్లు గైర్హాజయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, మహేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి తదితరులు భేటీకి హాజరుకాలేదు.

Jyothi

Jyothi

Next Story