Nizamabad: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే క్రిమినల్ కేసులు: కమిషనర్ కార్తికేయ

S. Srikanth
Updated on: 21 April 2020 12:55 PM IST
Nizamabad: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే క్రిమినల్ కేసులు: కమిషనర్ కార్తికేయ
X

నిజామాబాద్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని.. పోలీస్ కమిషనర్ కార్తికేయ చెప్పారు. అనవసరంగా రోడ్డు ఎక్కిన 3వేల వాహనాలు ఇప్పటి వరకు సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.

ఒకసారి పట్టుబడ్డ వాహనం మరోసారి తనిఖీల్లో దొరికితే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నగరంలో స్వయంగా సీపీ వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పలు వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు.




S. Srikanth

S. Srikanth

Next Story