లాక్ డౌన్ సడలింపుతో పెరిగిన క్రైమ్ రేట్

లాక్ డౌన్ సడలింపుతో పెరిగిన క్రైమ్ రేట్
x
Highlights

Crime rate intensifies in old city after unlock: కరోనా సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రతీ ఒక్కరు ఇళ్లకే పరిమితం కావడంతో చోరీలు, మర్డర్లు, ఆత్మహత్యలు నమోదు కాలేదు.

Crime rate intensifies in old city after unlock: కరోనా సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రతీ ఒక్కరు ఇళ్లకే పరిమితం కావడంతో చోరీలు, మర్డర్లు, ఆత్మహత్యలు నమోదు కాలేదు. ఇక సిటీలో క్రైమ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పాతబస్తీలోనూ లాక్ డౌన్ టైమ్ లో క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది. లాక్ డౌన్ టైమ్ లో సైలెంట్ గా ఉన్న రౌడీ షీటర్స్ ఇప్పుడు తిరిగి రెచ్చిపోతున్నారు.

ఓల్డ్ సిటీ రౌడీ షీటర్లకు అడ్డా ప్రతీ రోజు ఏదో ఒక నేరాలతో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ బిజీబిజీగా ఉంటాయి. లాక్ డౌన్ పుణ్యామా అని అన్నిరకాల నేరాలు తగ్గాయి. అయితే లాక్ డౌన్ సడలింపులతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్ల మధ్య ఆదిపత్య పోరులో భాగంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రోడ్లపై కత్తులతో బాహబాహికి దిగడంతో ఆ ప్రాంతంలో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నెల 8వ తేది రాత్రి చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో పాత కక్షలతో రౌడీ షీటర్ సయూద్ సాజిద్ అలియాస్ చాచుని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆరుగురు కలిసి చాచు ని మట్టు పెట్టారు. గతంలో చాచుతో పాటు మర్డర్ చేసిన గ్యాంగ్ పై కూడా అనేక కేసులున్నాయి. వారందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఇక జూలై 20 రాత్రి రెండు గ్యాంగ్ లు నడిరోడ్డు పై ఒకరిపై ఒకరు అటాక్ చేసుకున్నారు. రౌడీషీటర్ షానూర్ పై మరో గ్యాంగ్ కత్తితో దాడి చేసింది కత్తిపోట్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ షానూర్ ను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఈ హత్యలన్నీ రెండు గ్యాంగ్ ల మధ్య ఆదిపత్య పోరులో భాగంగా నే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇక జూన్ 5న ఒకే రోజు ఓల్డ్ సిటీలో మొత్తం నాలుగు మర్డర్లు జరిగాయి. లంగర్ హౌస్ ప్రాంతంలో నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హ‌త్యకు గుర‌య్యారు. ప్రత్యార్ధులు కత్తులతో దాడికి తెగ‌బ‌డ‌టంతో రౌడీ షీటర్లు స్పాట్ లోనే మృతి చెందారు. చ‌నిపోయిన‌ వారిని ఫయాదుద్దీన్, ఛాందీ మహ్మద్ లుగా గుర్తించారు. దాడికి పాల్పడ్డవారిని అష్రఫ్ ముఠా సభ్యులుగా గుర్తించారు పోలీసులు. ఓల్డ్ సిటీ రెయిన్ బజార్ పీఎస్ పరిధిలోని జాఫర్ రోడ్డులో ఇమ్రాన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇమ్రాన్ ని ముగ్గురు వ్యక్తులు వెంబడించి నడిరోడ్డుపై తల్వార్లతో దాడి చేసి దారుణ హత్య చేశారు.

లాక్ డౌన్ అనంతరం ఒక్క జూన్ నెలలోనే ఓల్డ్ సిటీలో ఆరు మర్డర్లతో పాటు ఆరు హత్యాయత్నాలు జరిగాయి. గత నెలలో కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. మోసిన్ అనే యువకుడు ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. ఇక ఛత్రినాక పీఎస్ పరిధిలో మధ్యం మత్తులో ఓ వ్యక్తి మరొకరి మెడ కోశాడు గాయాలపాలైన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో ఆస్తి వివాదాలతో ఓ వ్యక్తిని అతడి బంధువే హతమార్చాడు. గత నెలలో సీపీ ప్రెస్ మీట్ పెట్టి 2020 ఫస్ట్ హాఫ్ లో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని చెప్పుకొచ్చారు. ఐతే ఈ ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ రెండున్నర నెలలు లాక్ డౌన్ అమల్లో ఉంది. సో గతేడాది మార్చి, ఏప్రిల్, మేతో పోల్చితే ఈ సంవత్సరం మూడు నెలల్లో క్రైమ్ రేట్ చాలా తగ్గింది. కానీ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత మాత్రం క్రైమ్ మళ్లీ గతంలో లాగే కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories