Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం

Cricketer Siraj was allotted a house by the government
x

Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం 

Highlights

Mohammed Siraj: జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలం కేటాయింపు

Mohammed Siraj: టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేస్ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్‌ సాధించిన తర్వాత హైదరాబాద్‌ చేరుకున్న సిరాజ్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనకు టీమ్‌ ఇండియా జెర్సీని కూడా బహూకరించాడు. సిరాజ్‌ను అభినందించిన సీఎం.. హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories