Mohammed Siraj: సీఎం రేవంత్‌ని కలిసిన సిరాజ్.. టీమ్ ఇండియా జెర్సీ గిఫ్ట్

Cricketer Mohammed Siraj Meets CM Revanth Reddy
x

Mohammed Siraj: సీఎం రేవంత్‌ని కలిసిన సిరాజ్.. టీమ్ ఇండియా జెర్సీ గిఫ్ట్

Highlights

Mohammed Siraj: టీమ్‌ ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Mohammed Siraj: టీమ్‌ ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సిరాజ్ టీమ్‌ ఇండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుమతి ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ పాల్గొన్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టులో సిరాజ్‌ ఉన్నారు. ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత హైదరాబాద్‌ వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆ సమయంలో ఓపెన్‌టాప్‌ వాహనంపై వస్తూ ఆయన పాట పాడి అభిమానుల్లో జోష్‌ పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories