నిమిషాల్లో లక్షలు.. గంటల్లో జీవితాలు.. క్రికెట్ బెట్టింగ్ లలో కాలిపోతున్నాయి!

నిమిషాల్లో లక్షలు.. గంటల్లో జీవితాలు.. క్రికెట్ బెట్టింగ్ లలో కాలిపోతున్నాయి!
x
Highlights

నిమిషాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. గంటల్లో జీవితాలు తలకిందులవుతున్నాయి. దశాబ్దకాలంగా ఓ కొత్త వ్యసనం కుర్రకారును పట్టిపీడిస్తోంది. పల్లె, పట్టణం...

నిమిషాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. గంటల్లో జీవితాలు తలకిందులవుతున్నాయి. దశాబ్దకాలంగా ఓ కొత్త వ్యసనం కుర్రకారును పట్టిపీడిస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడాలేదు. యువకులను ఆకర్షిస్తూ ఆశపెట్టిస్తూ. చివరకు నట్టేట ముంచేస్తోంది. దాని పేరే క్రికెట్‌ బెట్టింగ్‌. అది వన్డే అయినా, టెస్ట్ అయినా టీ-20 అయినా లక్షలు కుమ్మరిస్తున్నారు. ఐపీఎస్ సీజన్ అయిపోయేసరికి అప్పుల పాలవుతున్నారు.

క్రికెటర్స్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టక ముందే పందెం రాయుళ్లు రంగంలోకి దిగిపోతున్నారు. మ్యాచ్ లపై, ఆటగాళ్ల ప్రతిభపై అంచనాలు వేస్తూ బెట్టింగ్ కాస్తారు. అయితే ఇన్నాళ్లు కరోనా కారణంగా ఒక్క మ్యాచ్ జరగలేదు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న బెట్టింగ్ రాజాలను ఇప్పుడు ఐపీఎల్ కనువిందు చేస్తోంది. ఆదివారం మ్యాచ్‌ ప్రారంభం కాగానే బుకీలు బెట్టింగ్‌లకు రెడీ అయిపోయారు.

క్రికెట్‌ బెట్టింగ్‌లో క్షణాల్లో జీవితాలు తారుమారు అవుతాయి. అక్కడ బంతిపడగానే ఇక్కడ లక్షలు చేతులు మారుతున్నాయి. బంతి బంతికి బెట్టింగ్ కాస్తున్నారు. ఈ ఓవర్ లో ఎన్నిపరుగులు వస్తాయి. ఎన్ని వికెట్లు పడతాయో అంటూ పందెలు వేసి, చివరకు జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అయితే ఈసారి బుకీల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. తొలి మ్యాచ్ జరిగిన రోజే బెట్టింగ్ రాయుళ్లను భరతం పట్టారు. నిజామాబాద్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories