Chada Venkat Reddy: మునుగోడులో టీఆర్ఎస్‌కే సీపీఐ మద్దతు.. భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తాం..

Chada Venkat Reddy: భవిష్యత్తులోనూ టీఆర్ఎస్‌తో కలిసి పోరాడాలని నిర్ణయించామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Published on: 20 Aug 2022 2:36 PM IST
CPI Support TRS Party Ahead Of Munugode Bypoll
X

Chada Venkat Reddy: మునుగోడులో టీఆర్ఎస్‌కే సీపీఐ మద్దతు.. భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తాం..

Chada Venkat Reddy: భవిష్యత్తులోనూ టీఆర్ఎస్‌తో కలిసి పోరాడాలని నిర్ణయించామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీచేసే పరిస్థితి లేదన్నారు. బీజేపీని ఓడించాలని జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

మునుగోడు బహిరంగ సభకు రావాలని సీఎం కేసీఆర్‌ తమను ఆహ్వానించారని చెప్పారు. సీపీఐ నేతలు సభలో పాల్గొంటారని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను ఇబ్బంది పెట్టిందని చెప్పారు. తమకు కేటాయించిన మూడు సీట్లలో కూడా వారి అభ్యర్థులు పోటీచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ ప్రయోజనాల వల్లే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story