CPI Narayana: తెలంగాణ గవర్నర్‌ లక్ష్మణరేఖ దాటుతున్నారు

CPI Narayana: గవర్నర్‌ రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు

Jyothi
Published on: 9 Jun 2022 1:43 PM IST
CPI Narayana Comment On Telangana Governor
X

CPI Narayana: తెలంగాణ గవర్నర్‌ లక్ష్మణరేఖ దాటుతున్నారు

CPI Narayana: తెలంగాణ గవర్నర్‌ లక్ష్మణరేఖ దాటుతున్నారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మహిళ దర్బార్ దేనికి పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్‌ రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వేషం మార్చుకొని తటస్త బాధ్యతతో వచ్చారు కాబట్టి.. ఆ మేరకు ప్రవర్తన ఉండాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విధానపరంగా సీపీఐ పోరాడుతుందన్నారు. మైనర్‌లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యానేరమని.. పబ్‌ను సీజ్ చేసి.. యజమానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనను టీఆర్ఎస్ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్‌ తలపెట్టిన దర్బార్‌ను రద్దు చేయాలని కోరుతున్నానన్నారు.

Jyothi

Jyothi

Next Story