CPI Narayana: విద్యాశాఖ మంత్రి సబితకు చదువురాదు.. అధికారులే మావోయిస్టులుగా మారారు..

CPI Narayana: నిర్మల్ జిల్లా బాసర ట్రపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 16 Jun 2022 7:45 PM IST
CPI Narayana Arrested at Basara IIIT
X

CPI Narayana: విద్యాశాఖ మంత్రి సబితకు చదువురాదు.. అధికారులే మావోయిస్టులుగా మారారు..

CPI Narayana: నిర్మల్ జిల్లా బాసర ట్రపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసన చేపట్టిన విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చదువురాదని ఎద్దేవా చేశారు. అంతేకాదు బాసర ట్రిపుల్ ఐటీ హిట్లర్ స్థావరం కాదన్నారు. అధికారులే మావోయిస్టులుగా మారారని విమర్శించారు.

బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద వరుసగా మూడో రోజుల విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్‌ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని విద్యార్థులు అంటున్నారు. పన్నెండు ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ బాసర ఆర్జీయూకేటీ స్టూడెంట్స్‌ మూడు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story