Kunamneni: మూసీ నిర్వాసితులతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సమావేశం

Kunamneni: సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను.. తొలగించాల్సిన అవసరం ఉందా?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Oct 2024 9:30 AM IST
CPI MLA Kunamneni meeting with Musi residents
X

Kunamneni: మూసీ నిర్వాసితులతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సమావేశం

Kunamneni: మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కోలా మాట్లాడుతున్నారనే ఆందోళన నిర్వాసితుల్లో ఉందన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చైతన్యపురిలోని వెంకటసాయినగర్‌లో మూసీ నిర్వాసితులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను తొలగించాల్సి అవసరం ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత సుందరీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story