D Raja: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలు డేంజర్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందే..

D Raja: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలు డేంజర్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందే..

Arun Chilukuri
Published on: 18 Jan 2023 5:17 PM IST
CPI Leader D Raja Fire On Bjp Govt in BRS Khammam Sabha
X

D Raja: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలు డేంజర్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందే..

CPI Leader D Raja: ఖమ్మం సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపై డి. రాజా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. బీజేపీ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనుకుంటోందని..ఈ కుతంత్రాలను అడ్డుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అన్నారు కానీ..., మోడీ ఎవరితో ఉన్నారని ప్రశ్నించారు. సామాన్యులతో మోడీ ఉన్నారా..?.. అదానీ, అంబానీలతో మాత్రమే మోడీ ఉన్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలు ప్రమాదకరమన్న డి. రాజా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనన్నారు. ఖమ్మం వేదికగా ఈ సందేశం దేశానికి చేరాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story