సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ కన్నుమూత

సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ కన్నుమూత
x
Highlights

సీనియర్ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయప హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో...

సీనియర్ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయప హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిశారు. గుండా మ‌ల్లేశ్ మృతిప‌ట్ల సీపీఐ పార్టీ నాయ‌కులు సంతాపం తెలిపారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగారు. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ల్లేశ్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం గుండా మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. అనంత‌రం మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని బెల్లంప‌ల్లికి త‌ర‌లించ‌నున్నారు.

ఇక పోతే సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో జన్మించారు. ఆయన స్వస్థలంలోనే మెట్రిక్యులేషన్ చదివి, అనంతరం బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. అప్పటి నుంచే ఆయన కార్మికుల సమస్యలపై గళం విప్పారు. ఆ తరువాత సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడంతో కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగి 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసారు. 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ప్రజల మెప్పును పొందుతూ మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్నారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సీపీఐ సభానాయకుడిగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories