CP Ranganath: ప్లాన్ ప్రకారం పేపర్‌ను షేర్ చేశారు.. బండి సంజయ్ ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి..

CP Ranganath Press Meet
x

CP Ranganath: ప్లాన్ ప్రకారం పేపర్‌ను షేర్ చేశారు.. బండి సంజయ్ ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి..

Highlights

CP Ranganath: కాల్ డేటా లభిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి

CP Ranganath: టెన్త్ పేపర్ లీక్ కేసు మరో మలుపు తిరిగింది. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ-1గా బండి సంజయ్‌ను చేర్చినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఏ2- ప్రశాంత్, ఏ3- మహేశ్, ఏ4- మైనర్ బాలుడు, ఏ5-శివ గణేశ్, ఏ6- సుభాష్, ఏ7-శశాంక్, ఏ8- శ్రీకాంత్‌ను చేర్చినట్లు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. వాట్సాప్ చాట్ ఆధారంగానే ఏ-1గా బండి సంజయ్‌‌ని గుర్తించినట్ల సీపీ రంగనాథ్ వివరించారు.

ప్రశాంత్, బండి సంజయ్ మధ్య తరచూ ఫోన్ కాల్స్ నడిచాయని సీపీ అన్నారు. ప్రశాంత్ వాట్సాప్ మెసేజ్‌లను రిట్రీవ్ చేస్తున్నామన్నారు. బండి సంజయ్‌ను తాము ఫోన్ అడిగామని... ఆయన లేదన్నారని సీపీ చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు.

పక్కా ప్లాన్ ప్రకారం పేపర్‌ను షేర్ చేశారని... 41-crpc ప్రకారం వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చన్నారు. కానీ తాము పక్కాగా లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యామని సీపీ చెప్పారు. కాల్ డేటా లభిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీపీ రంగనాథ్ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories