Hyderabad: ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్ధం

Hyderabad: ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్ధం
x

Hyderabad: ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్ధం

Highlights

Hyderabad: ఇందిరాపార్క్‌ను పరిశీలించిన హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

Hyderabad: ఇందిరాపార్క్ ధర్నా చౌక్.. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ఆ ప్రాంతంలోనే ధర్నా చేస్తారు.. ఎక్కడంటే అక్కడ కాదు.. ధర్నా చౌక్.. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు.. పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎందరో. .ఇంకెందరో ఇందిరాపార్కు వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు.

ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అక్కడ ఆందోళనా కార్యక్రమాలు చేయరాదని గతంలో నిషేధించింది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ తరువాత నిషేధం సడలించారు. అనంతరం ధర్నా చౌక్ లో మామూలుగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్‌లో నిరసనలపై కీలక నిర్ణయం తీసుకుంది. ధర్నాచౌక్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ధర్నా చౌక్‌లో ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ తరహాలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ దగ్గర ఏర్పాట్లకు నిర్ణయం తీసుకుంది.

దీంతో ఇందిరాపార్క్‌ను పరిశీలించారు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. ప్రభుత్వ సూచన మేరకు ధర్నాచౌక్‌ను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ధర్నాచౌక్‌లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నాలు చేపట్టవచ్చని, అయితే.. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ధర్నాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories