CP CV Anand: ప్రేమ వివాహం ఇష్టం లేదా.. కక్ష పెంచుకుంటే సహించం..

CP CV Anand: బేగంబజార్‌లో ఇటీవల జరిగిన నీరజ్ హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.

Arun Chilukuri
Updated on: 30 May 2022 5:30 PM IST
CP CV Anand Warning to Parents Over Honour Killing
X

CP CV Anand: ప్రేమ వివాహం ఇష్టం లేదా.. కక్ష పెంచుకుంటే సహించం..

CP CV Anand: బేగంబజార్‌లో ఇటీవల జరిగిన నీరజ్ హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. హైకోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తొందరగా న్యాయం జరిగేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. నీరజ్ పన్వార్‌ కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారులు కలిశారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ చౌహన్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం షా ఇనాయత్ గంజ్ పీఎస్ లో యాదవ సంఘం నేతలతో సీపీ సీవీ ఆనంద్ మీటింగ్ నిర్వహించారు. ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఇరు వర్గాలను హెచ్చరించారు. నేటి యువత తమ ఇష్టానికి అనుగుణంగా జీవించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొంత మంది నచ్చిన వాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమ వివాహం ఇష్టం లేకపోతే వాళ్లను పట్టించుకోకుండా వదిలేయండి. కక్ష పెంచుకొని హత్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని సీవీ ఆనంద్ హెచ్చరించారు. మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అల్లర్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు సీపీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story