బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియే అసలు సూత్రధారి: సీపీ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియే అసలు సూత్రధారి: సీపీ
x
Highlights

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియనే అసలు సూత్రధారిగా తేల్చారు పోలీసులు. కిడ్నాప్‌ కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్‌ చేడమే కాక.. కీలక...

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియనే అసలు సూత్రధారిగా తేల్చారు పోలీసులు. కిడ్నాప్‌ కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్‌ చేడమే కాక.. కీలక ఆధారాలు సేకరించారు. ఫేక్ నెంబర్ ప్లేట్ లతో సంఘటనా స్థలానికి నిందితులు వెళ్లారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నిందితుల సెల్ పోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు మియాపూర్ లోని సెల్ ఫోన్ షాపులో సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు సీపీ తెలిపారు. కిడ్నాప్‌ కేసులో ఇప్పటికే మాజీమంత్రి అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్నారు.

కిడ్నాప్‌ కోసం అఖిలప్రియ 70956 37583 ఫోన్ నెంబర్లను వాడారని సీపీ వెల్లడించారు. కూకట్‌పల్లిలోని నిందితులు ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారని, కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులో అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. ప్రవీణ్‌రావు ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని అంజనీకుమార్‌ పేర్కొన్నారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉంది అని సీపీ తెలిపారు. ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశాం. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడకల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ అంజనీకుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories