Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కొవిడ్ నిబంధనలు బేఖాతరు

Peddapalli: మంథని, కమాన్‌పూర్, ముత్తారం మండలాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ దగ్గరకు భారీగా జనాలు

Sandeep Eggoju
Published on: 28 Jun 2021 2:19 PM IST
Covid Rules Break in Peddapalli District Vaccination Center
X

కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ (ఫైల్ ఫోటో)

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కొందరు కొవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. మంథని, కమాన్‌పూర్, ముత్తారం మండలాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ దగ్గరకు జనాలు భారీగా తరలివచ్చారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌ దగ్గర కొవిడ్ వ్యాక్సినేషన్‌ కోసం జనాలు ఎగబడుతున్నా.. అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. వ్యాక్సినేషన్ కోసం అందరూ ఒక చోట గుమిగూడటంతో కొవిడ్‌ సోకే ప్రమాదం ఉందని తెలిసినా.. వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నా.. కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story