Telangana: తెలంగాణలో కొవిడ్‌ మెడిసిన్స్‌ కటకట!

Covid Medicine Shortage in Telangana
x

Telangana: తెలంగాణలో కొవిడ్‌ మెడిసిన్స్‌ కటకట!

Highlights

Telangana: తెలంగాణలో కొవిడ్‌ మెడిసిన్స్‌ కటకట ఏర్పడింది. ఇప్పటికే వైరస్‌ సోకిన తర్వాత వినియోగించే రెమ్‌డెసివిర్‌ టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడింది.

Telangana: తెలంగాణలో కొవిడ్‌ మెడిసిన్స్‌ కటకట ఏర్పడింది. ఇప్పటికే వైరస్‌ సోకిన తర్వాత వినియోగించే రెమ్‌డెసివిర్‌ టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. తాజాగా వైరస్‌ సోకిన తొలినాళ్లలో వాడే అతి ముఖ్యమైన మెడిసిన్స్‌ చాలాచోట్ల దొరకట్లేదు. కార్టికో స్టెరాయిడ్స్‌, యాంటీబయాటిక్స్‌, విటమిన్‌ ట్యాబ్లెట్స్‌, ఇంజక్షన్లు అవసరమైనంత మేర దొరకడం లేదు. గత రెండు నెలల్లో కొవిడ్‌ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకోగా ఇదే సమయంలో మెడిసిన్స్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. కొవిడ్‌ వచ్చిన తొలి రోజుల్లో వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ మెడిసిన్స్‌.. ఫావిపిరావిర్‌ కాగా ఈ ట్యాబ్లెట్లు ప్రధానంగా ఐదారు పేరున్న సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి.

హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయి ట్రీట్మెంట్‌ పొందే వారి కంటే ఇళ్లలో ఉంటూ చికిత్స పొందేవారు 70 శాతానికి పైగా ఉంటున్నారు. మొదటి వారంలో ఏ మందులు వాడాలో జ్వరం తగ్గకపోతే రెండోవారంలో ఏ మందులు వాడాలో కూడా చెబుతున్నారు. ఇందులో స్టెరాయిడ్‌ల ప్రాధాన్యం గురించి కూడా ఎక్కువ ప్రచారం జరగడంతో డిమాండ్‌ పెరిగింది. పైగా ఈ మందులేమీ బాగా ఖరీదైనవి కూడా కావు.

డెక్సామెథజోన్‌ ఔషధమైతే 0.5 మిల్లిగ్రాములతో కూడిన పది ట్యాబ్లెట్లు 3 రూపాయల లోపే. వీటిని కొందరికి రోజుకు 3 మిల్లీ గ్రాములు మరికొందరికి 4 మిల్లీ గ్రాముల చొప్పున సుమారు 10 రోజుల వరకూ సూచిస్తుంటారు. కానీ ఇవి కూడా సరిగా అందుబాటులో లేవు. ఇదే విధంగా ప్రజల వినియోగానికి తగినట్లుగా ఉత్పత్తి జరగకపోతే మున్ముందు పారాసెటమాల్‌కు కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories