జగిత్యాల జిల్లాలో కరోనా భయం.. జిల్లాను భయపెడుతున్న ముంబై కేసులు..

జగిత్యాల జిల్లాలో కరోనా భయం.. జిల్లాను భయపెడుతున్న ముంబై కేసులు..
x
Highlights

ఒకప్పుడు అన్నం పెట్టి ఉపాధిని కల్పించినా ముంబాయి ఇప్పుడు జగిత్యాల జిల్లాను భయపెడుతోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల భయం అంతగా లేకుండా ప్రశాంతంగా ఉన్నా...

ఒకప్పుడు అన్నం పెట్టి ఉపాధిని కల్పించినా ముంబాయి ఇప్పుడు జగిత్యాల జిల్లాను భయపెడుతోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల భయం అంతగా లేకుండా ప్రశాంతంగా ఉన్నా జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. అందుకు కారణం ముంబాయ్ కి ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికులు తిరిగి సొంతూళ్లకు రావడమే. పట్టణ కేంద్రాల కంటే గ్రామాల్లోనే కరోనా భయం పట్టుకుంది. జగిత్యాల జిల్లాలో కరోనా భయంపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.

జగిత్యాల జిల్లా అంటేనే వలస జీవుల జిల్లాగా పేరు ఉంది. ఈ జిల్లా నుంచి ముంబయికి వేల మంది వలస వెళ్తారు. పిల్లలను, ముసలి తల్లిదండ్రులను సొంతూళ్లో వదిలేసి ముంబయ్‌లో పని చేసేందుకు వెళ్తారు. అలా వెళ్లిన వాళ్లే ఇప్పుడు జగిత్యాల జిల్లాకు కరోనాను తీసుకొస్తున్నారని అనుమానిస్తున్నారు. కరోనా భయంతో తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. దాంతో జగిత్యాల జిల్లాలో వలస కార్మికులతో కరోనా భయం పట్టుకుంది.TelanganaCOVID

జగిత్యాల జిల్లా నుంచి వలస వెళ్లిన వారు దాదాపు 4వేల మంది తిరిగి వచ్చారు. అందులో మూడువేల మంది ముంబయి నుంచే వచ్చినట్టు జిల్లా అధికారులు గుర్తించారు. ఈ మూడువేల మందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇద్దరికి ఢిల్లీతో లింకు ఉన్నాట్టు గుర్తించారు. ఆ తర్వాత అత్యధికంగా ముంబాయి నుంచి ఉన్నట్టు గుర్తించారు. ఓ క్యాన్సర్ పేషెంట్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక మిగతా 7 కేసులు ముంబయి నుంచి వచ్చినవారివే అని అధికారులు వెల్లడించారు. దాంతో జిల్లా పోలీసులు అలెర్ట్ అయ్యారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని, ప్రతి వ్యక్తిని తమ నిఘాలో ఉంచుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఏడు బార్డర్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అందులో అత్యంత కీలకమైంది గండి హనుమాన్ దగ్గర ఉన్న చెక్‌పోస్ట్. ఈ రోడ్డు మార్గం ద్వారానే ముంబాయి నుంచి జగిత్యాలకు 90 శాతం మంది వస్తున్నారు. దాంతో ఈ చెక్‌పోస్ట్ దగ్గర భద్రతను పెంచారు.

జగిత్యాల జిల్లాలో వస్తున్న కేసులన్నీ గ్రామీణ ప్రాంతాల్లో నమోదు అవుతున్నావే అదే ఇప్పుడు అందరిని కలవరపెడుతుంది. గ్రామాల్లో కరోనా లక్షణాలు వచ్చినవాళ్లను అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు. అలాంటి వారిలోనే పాజిటివ్ కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే గ్రామాల్లో వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారు అనే భయం ఆ గ్రామాలను వెంటాడుతుంది. జిల్లాలో ఉన్న నాలుగు దిక్కులుగా కరోనా పాకింది. అవి కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలుగానే ఉన్నాయి. అయితే జిల్లాలో కరోనాపై అధికారులు, ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని తాటిపల్లి, తక్కలపల్లి ధర్మపురి మండలంలోని నేరేళ్ల కథలపూర్ మండలంలోని చింతకుంట, వెలగటూర్ మండలంలోని గుల్లకోట, రాజక్కపల్లి గొల్లపల్లి మండలంలోని బొంకూర్ ఇలా గ్రామాల్లోకి కరోనా విస్తరించి జగిత్యాల జిల్లాతో పాటు చుట్టూ పక్కల ఉన్న ప్రాంతాలని కూడా అందరిని కలవర పెడుతోంది ఈ మహమ్మారి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories