Mancherial: మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం

Mancherial: నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

Shashank Gullapelli
Published on: 20 March 2024 3:58 PM IST
Court Order For Confiscation Of RDO Office Of Mancherial
X

Mancherial: మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం

Mancherial: నిర్లక్ష్యం..అడుగడుగునా నిర్లక్ష్యం. నష్ట పరిహారం కోసం..ఓ మహిళ నలభై ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను సైతం భేఖాతరు చేశారు. చివరికి..కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్యం వహించారు. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కార్యాలయాలన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశాల జారీ చేసింది. ధర్మాసనం ఆదేశాలతో ఆర్డీవో ఆఫీసును సీజ్ చేసి సామగ్రిని జప్తు చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story