భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబు పేలడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 2:42 PM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటుబాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబు పేలడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రైలు పట్టాల పక్కన బాంబు పడి ఉండగా.. ఓ కుక్క ఆ సంచిని కొరకడంతో పేలిపోయింది. ఘటనలో అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాటుబాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. పట్టాలపై బాంబు ఎవరు పడేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story