Coronavirus updates in Telangana: తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు..

S. Srikanth
Published on: 21 Aug 2020 8:57 AM IST
Coronavirus updates in Telangana: తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు..
X

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న( గురువారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,967 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 08 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 99,391కి చేరింది. మృతుల సంఖ్య 737కి పెరిగింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 76,967కి చేరింది. ప్రస్తుతం 21,687 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్క రోజే 26, 767 టెస్టులు చేయగా 1,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,48,078 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 473, రంగారెడ్డిలో 202, మేడ్చల్ లో 170 కేసులు నమోదయ్యాయి.. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.72గా ఉంది. దేశంలో 70.76గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.76 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.





S. Srikanth

S. Srikanth

Next Story